: వైసీపీకి షాక్... పార్టీకి గుడ్ బై చెప్పిన సీతారాం
వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం పార్టీకి గుడ్ బై చెప్పారు. తన నియోజకవర్గమైన భీమిలిలో తనకు తెలియకుండానే అదనంగా మరో సమన్వయకర్తను నియమించడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. దీంతో, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పార్టీ తనను మోసం చేసిందని.. అందుకే వైసీపీకి గుడ్ బై చెప్పానని తెలిపారు. 2014లో ఆస్తులు అమ్ముకుని పార్టీకి సేవ చేశానని... కానీ, డబ్బులు పెట్టేవారే పార్టీకి ముఖ్యమని జగన్ అనడం దారుణమని అన్నారు. తన మద్దతుదారులు, అభిమానులతో చర్చించి, భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు.