: నరేష్, స్వాతి కేసులో కొత్త ట్విస్ట్... ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో


తెలంగాణలోని భువనగిరిలో సంచలనం కలిగించిన స్వాతి ఆత్మహత్య, నరేష్ అదృశ్యం కేసులో పోలీసులకు కీలక ఆధారాలు దొరికాయి. తాను ఆత్మహత్య చేసుకునే ముందు స్వాతి తీసిన సెల్ఫీ వీడియో ఒకటి బయటకు వచ్చింది. నరేష్ కుటుంబ సభ్యులు తమ వివాహం తరువాత తీవ్రంగా హింసించారని, కట్నం కోసం వేధించారని ఈ వీడియోలో స్వాతి వాపోయింది. తన ఆత్మహత్యకు నరేష్ తల్లిదండ్రులే కారణమని చెప్పుకొచ్చింది. వారు తనను కానుకలు అడిగారని, అవి ఇచ్చుకోలేమని చెబితే నిందించారని పేర్కొంది.

ఈ క్రమంలో తన బిడ్డ ఆత్మహత్యకు వరకట్న వేధింపులే కారణమని స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. సెల్ఫీ వీడియోలో స్వాతి ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పిందని, వెంటనే నరేష్ తల్లిదండ్రులను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, నరేష్ అదృశ్యమై మూడు వారాలు గడిచినా, ఇంతవరకూ ఆచూకీ లభించలేదు. అతన్ని వెంటనే కోర్టులో హాజరు పరచాలని, లేకుంటే నివేదిక ఇవ్వాలని పోలీసులను హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు.

  • Loading...

More Telugu News