: తలాక్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో.. అదే విషయంపై ఆసక్తికర తీర్పునిచ్చిన కేరళ కుటుంబ న్యాయస్థానం!


ముస్లిం సంప్రదాయమైన ట్రిపుల్ తలాక్ పై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతున్న సమయంలో... కేరళలోని మలప్పురం ఫ్యామిలీ కోర్టు తలాక్ పై సంచలన తీర్పు వెలువరించింది. సరైన కారణాలు లేకుండా పోస్టు ద్వారా పంపిన తలాక్ చెల్లదని స్పష్టం చేసింది. మలప్పురంకి చెందిన అలీ ఫైజీ 2012లో తన భార్యకు ట్రిపుల్ తలాక్‌ చెబుతూ... ఆ విషయాన్ని ఉత్తరంలో రాసి రిజిస్టర్డ్‌ పోస్టులో ఆమె పుట్టింటికి పంపాడు. దానిని తీసుకునేందుకు ఆమె నిరాకరించడమే కాకుండా, అలీపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

దీంతో ఈ కేసును విచారించిన మలప్పురం ఫ్యామిలీ కోర్టు... అసలు ట్రిపుల్ తలాక్ చెప్పేందుకు కారణమేంటి? అంటూ ప్రశ్నించింది. దంపతుల మధ్య విభేదాల పరిష్కారానికి ఏం చేశారు? రాజీకి ప్రయత్నించారా? కౌన్సిలింగ్ తీసుకున్నారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. ఇవేవీ పాటించనందున ఖురాన్‌, ఇస్లామిక్‌ చట్టాలతో పాటు, గత కోర్టు కేసుల తీర్పులననుసరించి ఈ తలాక్‌ చెల్లదని స్పష్టమైన తీర్పునిచ్చింది.

  • Loading...

More Telugu News