: ఐసిస్-సిరియా సైన్యానికి మధ్య భీకర పోరు.. 32 మంది ఉగ్రవాదులు సహా 49 మంది మృతి


సిరియా సైన్యానికి, ఐసిస్ ఉగ్రవాదులకు మధ్య మరోమారు భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐదు రోజుల క్రితం అలెప్పో సమీపంలోని ఓ ఆర్మీ స్థావరాన్ని ఐసిస్ ఉగ్రవాదులు తమ అధీనంలోకి తీసుకున్నారు. దీనిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వ అనుకూల దళాలు రంగంలోకి దిగాయి. దీంతో ఇరు వర్గాల మధ్య హోరాహోరీ పోరు ప్రారంభమైంది. ఆర్మీ స్థావరాన్ని దక్కించుకునే క్రమంలో మొత్తం 49 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో 17 మంది సైనికులు కాగా 32 మంది ఐసిస్ ఉగ్రవాదులు ఉన్నారు.

  • Loading...

More Telugu News