: ఆ క్రికెటర్ పేరుకి ముందు 'వాషింగ్టన్' ఎలా వచ్చిందో తెలుసా?.. అదీ కృతజ్ఞత అంటే..!
తాజా ఐపీఎల్‌లో యువ సంచలనం వాషింగ్టన్ సుందర్ పేరు మార్మోగుతోంది. పుణె జట్టు సభ్యుడైన సుందర్ చెన్నై చిన్నోడు. ముంబైతో జరిగిన తొలి క్వాలిఫైర్ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి ముంబై నడ్డి విరిచి పుణె విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. అసలు ఈ ‘వాషింగ్టన్’ ఏంటి? అన్న ప్రశ్న క్రికెట్ అభిమానులను తొలిచేస్తోంది. నిజానికీ వాషింగ్టన్ వెనక బోల్డంత కథ ఉంది.
ఓసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తే.. సుందర్ తండ్రి పేరు ఎం.సుందర్. అతడికి పీడీ వాషింగ్టన్ అనే సైనికాధికారి బోల్డంత సాయం చేశాడట. స్కూలు ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్ తదితర వాటిని కొనుక్కునేందుకు ఆర్థికంగా సాయం అందించాడట. దీనికి కృతజ్ఞతగా తనకు కొడుకు పుడితే ఆయన పేరును పెట్టాలనుకున్నాడు. అలా పుట్టిన తొలి కొడుక్కి వాషింగ్టన్ అని పేరు పెట్టాడు. ఇంకో కొడుకు పుట్టి ఉంటే అతడికి కూడా వాషింగ్టన్ జూనియర్ అని పెట్టేవాడినని సుందర్ తండ్రి పేర్కొన్నారు. చేసిన సాయానికి సుందర్ ఇలా కృతజ్ఞత తీర్చుకున్నారన్నమాట!