: భారత్ లోని అమెరికా కాన్సులేట్ కేంద్రాలలోకి ల్యాప్ టాప్ తో రావద్దని నిబంధన!


భారత్ లోని ప్రధాన నగరాల్లో ఉన్న తమ కాన్సులేట్ కార్యాలయాల్లోకి ల్యాప్ టాప్ లు, ట్యాబ్ లు తీసుకుని రాకూడదన్న నిబంధనను అమెరికా విధించింది. వివిధ దేశాల నుంచి తమ దేశానికి వచ్చే విమానాల్లోకి ల్యాప్ ట్యాప్, టాబ్లెట్లు తీసుకురావడాన్ని నిషేధించిన అమెరికా... తాజాగా భారత్ లోని ఢిల్లీ సహా, ముంబై, కోల్‌కతాల్లోని అమెరికా కాన్సులేట్ లకు వచ్చే వారు నోట్‌ బుక్స్‌, క్రోమ్‌ బుక్స్‌, ఐపాడ్స్‌, కిండిల్స్‌, మాక్‌ బుక్స్‌ సహా ల్యాప్ టాప్ లు, ట్యాబ్ లు తీసుకురావడాన్ని నిషేధిస్తున్నట్టు ప్రకటించింది.

కాగా, ఇప్పటికే రష్యా రాయబారితో ట్రంప్ మాట్లాడిన సందర్భంగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ల్యాప్ టాప్, ట్యాబ్ లతో శక్తిమంతమైన బాంబులు తయారు చేశారని, వాటితో విధ్వంసానికి రచన చేశారని తెలిపిన సంగతి తెలిసిందే. అయితే అమెరికాలో ఈ రకమైన దాడులకు ఆస్కారం లేకపోవడంతో తాజాగా వాటితో తమ కాన్సులేట్ కేంద్రాలకు ప్రమాదం పొంచి ఉందని భావించిన అమెరికా తాజాగా వీటిని తీసుకురావడంపై నిషేధం విధించింది. అయితే, ఈ నిషేధిత జాబితాలో మొబైల్ ఫోన్లు మాత్రం లేవు.  

  • Loading...

More Telugu News