: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు మహిళ తనికెళ్ల నాగమణి మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు మహిళ తనికెళ్ల నాగమణి మృతి చెందారు. హన్రీ కౌంటీలో టీచర్‌గా పనిచేస్తున్న ఆమె అట్లాంటాలోని న్యూటన్ కౌంటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను పీడ్‌మోంట్ న్యూటన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. భారత్‌లో ఉన్న నాగమణి భర్త శంభుప్రసాద్ సమాచారం తెలిసిన వెంటనే అట్లాంటాకు బయలుదేరారు.