: ప్రాణాలు తీస్తున్న ఆ ఏనుగుకి మరణశిక్ష విధించేందుకు ప్రయత్నాలు!


ప‌శ్చిమ బెంగాల్‌లోని ఓ ప్రాంతంలో బీభత్సం సృష్టిస్తోన్న ఓ ఏనుగుకి మ‌ర‌ణ‌శిక్ష విధించాల‌ని చూస్తున్నారు. అంద‌రూ ఆ మ‌గ‌ ఏనుగుని ‘గణేశ్’ అని పిలుచుకుంటారు. జల్దపారా నేషనల్ ఫారెస్ట్‌ పరిసర ప్రాంతాల్లో ఇది ఉంటుంది. అయితే, ఇది త‌రుచూ మనుషులపై విరుచుకు పడుతూ వారి ప్రాణాలు తీస్తోంది. ఇప్పటికే ఈ ఏనుగుకి 8 మంది బ‌లయ్యారు. మ‌నుషుల‌నే కాక‌ సాటి ఏనుగుల‌ను కూడా ఈ గ‌జ‌రాజు భ‌య‌పెడుతోంది. దాన్ని అదుపు చేయడానికి అటవీ అధికారులు ఎంత‌గా ప్ర‌య‌త్నించినా అది మాట విన‌డం లేదు.

దీంతో, అది ఏకాంతంగానైనా గడుపుతుందేమోనని ‘ఊర్వశి’ అనే ఓ ఆడ ఏనుగును దానికి తోడు కోసం తీసుకొచ్చి వ‌దిలిన‌ప్ప‌టికీ దాని తీరు మార‌లేదు. ఇటీవలే మదరిహత్ ప్రాంతంలో ఆ ఏనుగు బీభ‌త్సం సృష్టించి జయనారాయణ్ శర్మ (80) అనే వృద్ధుడి ప్రాణాలు తీసింది. దీంతో అక్క‌డి వారంతా ఆ ఏనుగుపై మండిప‌డుతున్నారు. ఈ ఏనుగు చేసిన బీభ‌త్సం కార‌ణంగా జ‌రిగిన న‌ష్టాల‌పై అట‌వీశాఖ అధికారులు రిపోర్టు త‌యారుచేస్తున్నారు. ఇటువంటి క్రూర స్వభావం ఉన్న ఏనుగులకు మ‌ర‌ణ‌శిక్ష విధించ‌డానికి చట్టంలోనూ వెసులుబాటు ఉంద‌ని అంటున్నారు.

  • Loading...

More Telugu News