: పాక్ కలలు కంటోంది... సత్యమేవ జయతే!: కుల్‌భూష‌ణ్ జాద‌వ్ కేసులో తీర్పుపై వీరేంద్ర సెహ్వాగ్


గూఢ‌చారిగా ఆరోప‌ణ‌లు చేస్తూ భార‌తీయ నేవీ మాజీ అధికారి కుల్‌భూష‌ణ్ జాద‌వ్‌కు పాకిస్థాన్‌ ఉరిశిక్ష విధించిన‌ కేసులో అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం ఇచ్చిన తీర్పు ప‌ట్ల టీమిండియా మాజీ క్రికెట‌ర్‌, ట్విట్ట‌ర్ కింగ్ వీరేంద్ర సెహ్వాగ్‌ స్పందిస్తూ 'స‌త్య‌మేవ జ‌య‌తే' అని పేర్కొన్నాడు. అయితే, సెహ్వాగ్ చేసిన పోస్ట్ పై ఓ పాకిస్థానీ స్పందిస్తూ... తుది తీర్పు త‌మ‌కే అనుకూలంగా వ‌స్తుందని, ఒకవేళ రాక‌పోయినా తాము చేసేదే చేస్తామ‌ని అన్నాడు. ఈ కామెంట్‌పై వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ మ‌రో ట్వీట్ చేశాడు. భార‌త్‌ను క్రికెట్ వ‌ర‌ల్డ్ కప్‌లో పాకిస్థాన్ ఓడిస్తుందంటూ పాక్ అభిమానులు ఎలా అయితే కలలు కంటారో, కుల్‌భూష‌ణ్ జాద‌వ్ విష‌యంలోనూ అలాగే క‌లలు కంటూ ఉన్నార‌ని సెటైర్ వేశాడు.



  • Loading...

More Telugu News