: పూర్తిగా మ్యాచ్ జరగకపోవడమే ఓటమికి కారణం: ముత్తయ్య మురళీధరన్


అత్యంత కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమిపాలు కావడానికి ఆట పూర్తిగా జరగకపోవడమే కారణమని ఆ జట్టు బౌలింగ్ కోచ్ మురళీధరన్ అన్నాడు. వర్షం వల్ల మ్యాచ్ పూర్తిగా జరగలేదని... ఒకవేళ 20 ఓవర్ల పాటు మ్యాచ్ కొనసాగి ఉంటే తమ జట్టు గెలుపొందేదని తెలిపాడు. తమ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వర్షం పడటం... మ్యాచ్ ఫలితాన్ని ఆరు ఓవర్లకు కుదించడం తమ విజయావకాశాలను దెబ్బతీశాయని చెప్పారు. వర్షం కారణంగా కోల్ కతా నైట్ రైడర్స్ లక్ష్యాన్ని ఆరు ఓవర్లలో 48 పరుగులుగా నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి 5.2 ఓవర్లలో కోల్ కతా ఛేదిందించి.  

  • Loading...

More Telugu News