: డబ్బు కోసమే ఇక్కడున్నా.. పారితోషికం లేనిదే నటించలేను!: కమలహాసన్


రెమ్యునరేషన్ తీసుకోకుండా తాను నటించలేనని విలక్షణ నటుడు కమలహాసన్ తేల్చి చెప్పారు. డబ్బు కోసమే తాను సినీ రంగంలో ఉన్నానని తెలిపారు. తమిళంలో ప్రసారం కానున్న బిగ్ బాస్ కార్యక్రమానికి కమల్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. దీనికి సంబంధించిన టీజర్ ను ఆ టీవీ నిర్వాహకులు నిన్న విడుదల చేశారు. ఈ సందర్భంగా బుల్లితెరపై తన ఎంట్రీ గురించి కమల్ మాట్లాడుతూ, డబ్బు కోసమే తాను బుల్లితెరపై వ్యాఖ్యాతగా అవతారం ఎత్తానని చెప్పారు. డబ్బు తీసుకోకుండా తాను నటించనని స్పష్టం చేశారు. బుల్లితెర వల్ల ఓవైపు డబ్బు సంపాదించవచ్చని, మరోవైపు అభిమానులకు సినిమాల కంటే ఎక్కువగా దగ్గరవ్వొచ్చని కమల్ తెలిపారు. 

  • Loading...

More Telugu News