: ఇజ్రాయెల్, పాలస్తీనాలు భారత్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలనుకున్నాయి.. ఇది వెంకయ్యనాయుడి గొప్పదనం: సుష్మా స్వరాజ్


ఐక్యరాజ్యసమితి 'ఆవాస' ప్రాజెక్టు అధ్యక్షుడిగా ఎన్నికైన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి కేంద్ర కేబినెట్ అభినందనలు తెలియజేసింది. ఈ సందర్భంగా మరో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఆవాస అధ్యక్షుడిగా వెంకయ్య ఎంపిక నాటకీయ పరిణామాల మధ్య జరిగిందని చెప్పారు. భారత్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఇజ్రాయెల్, పాలస్తీనాలు నిర్ణయించుకున్నాయని... అయితే, ఆ రెండు దేశాల ప్రతినిధులతో వెంకయ్య చర్చలు జరిపి, భారత్ కు అనుకూలంగా ఓటు వేసే విధంగా ఒప్పించారని తెలిపారు. ఈ సందర్భంగా మోదీ సహా సహచర మంత్రులంతా వెంకయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయంగా మరిన్ని ఉన్నతమైన పదవులను చేపట్టాలని ఆకాంక్షించారు. 

  • Loading...

More Telugu News