: హైదరాబాదులోని డాక్టర్ ఇంట్లో విజయవాడ హవాలా ఆసుపత్రుల ఎండీలు...గుర్తించిన పోలీసులు


ఏపీ ఆర్ధిక రాజధాని విజయవాడలో కలకలం రేపిన హవాలా నిందితులైన హెల్ప్, టైమ్ ఆసుపత్రుల ఎండీలు చలపాటి రవి, మైనేని హేమంత్ లు హైదరాబాదులోని ఓ వైద్యుడి ఇంట్లో ఆశ్రయం పొందుతున్నట్టు పోలీసులు గుర్తించారు. 50 కోట్ల రూపాయల హవాలా వ్యాపారంలో వచ్చిన విభేదాలతో రంగురాళ్ల వ్యాపారం చేసే బ్రహ్మాజీ అనే వ్యక్తిని తీవ్రంగా కొట్టిన అనంతరం ఈ దారుణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అప్రమత్తమైన వైద్యులు తమ అక్రమాలు బయటకు రాకుండా ఉండేందుకు రాజకీయ నాయకులను రంగంలోకి దించి, రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.

దీంతో బాధితుడు నిన్న చెప్పిన మాటలకు, నేడు చెబుతున్న మాటలకు మధ్య తేడా ఉందని పోలీసులు చెబుతున్నారు. అదే సమయంలో పోలీసులపై ఒత్తిడి తేవడం ద్వారా కేసును నీరుగార్చాలని పన్నాగం పన్నారు. కేసును నేరుగా విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్ పర్యవేక్షిస్తుండడంతో నిందితులు హైదరాబాదు చేరుకుని, తమ ప్రయత్నాలు తాము చేస్తున్నట్టు తెలుస్తోంది. వీరి కదలికలపై కన్నేసిన పోలీసులు, వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News