: డోర్ లో చేయి ఇరుక్కుని బుల్లెట్ ట్రైన్ తో పాటుగా పరుగెత్తిన ప్రయాణికుడు....ఈ వీడియో చూడండి
చైనాలోని జియాంగ్స్ ప్రావిన్స్ లో ఓ ప్రయాణికుడు ఫ్లాట్ ఫాంపై బుల్లెట్ ట్రైన్ తో పాటుగా పరుగెత్తే ప్రయత్నం చేశాడు. ఇంతలో అతనిని చూసిన పలువురు ప్రయాణికులు ట్రైన్ ను ఆపాలంటూ డ్రైవర్ కు సైగలు చేశారు. డ్రైవర్ స్పందించకపోయినా ట్రైన్ ఆగిపోవడంతో అంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు....ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... స్నేహితులకు వీడ్కోలు చెప్పేందుకు వచ్చిన ఒక ప్రయాణికుడు వారికి వీడ్కోలు చెబుతున్న ఆనందంలో డోర్ పక్కన చేతిని ఉంచాడు. ట్రైన్ డోరు మూసుకునే క్రమంలో అతని చేతి వేలు ఆ డోర్ లో చిక్కుకుపోయింది.
ఇంతలో ట్రైన్ బయల్దేరిపోయింది. చేతివేలు బయటకు రాకపోవడంతో రైల్వే ఫ్లాట్ ఫాంపై ఆ వ్యక్తి బుల్లెట్ ట్రైన్ తో పాటుగా పరుగెత్తాడు. అతనిని చూసిన పలువురు ప్రయాణికులు ట్రైన్ ఆపాలంటూ డ్రైవర్ కు సైగలు చేశారు. ఆయన చూశాడో లేదో తెలియదు కానీ... ఈ బుల్లెట్ ట్రైన్ డోర్ పూర్తిగా మూసుకోని పక్షంలో ట్రైన్ దానికదే ఆగిపోయే సౌలభ్యం అందులో వుంది. దీంతో కాసేపటికే ట్రైన్ ఆగిపోయింది. తిరిగి డోర్ తెరుచుకోవడంతో ఆయన ఎలాంటి ప్రమాదం బారిన పడకుండా క్షేమంగా బయటపడ్డాడు. దీనిని వీడియో తీసిన ఒక ప్రయాణికుడు సోషల్ మీడియాలో పెట్టగా, అది వైరల్ అవుతోంది. ఆ వీడియో మీరు కూడా చూడండి.