: సుక్మా జిల్లాలో ఎన్ కౌంటర్ ఏమీ జరగలేదు: మావోయిస్టు పార్టీ దండకారుణ్య కమిటీ
ఛత్తీస్ గడ్ లోని సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్, కోబ్రా దళాలు నిర్వహించిన ఎన్ కౌంటర్ లో 20 మంది నక్సల్స్ హతమయ్యారనే వార్తలను మావోయిస్టు పార్టీ దండకారుణ్య కమిటీ ఖండించింది. అసలు, ఈ ఎన్ కౌంటర్ జరగలేదని, అటవీ ప్రాంత గ్రామాల్లో పోలీసులు బీభత్సం సృష్టిస్తున్నారని పేర్కొంది. ఈ నెల 13,14,15 తేదీల్లో చిన్న గోట్కుల్, పెద్ద గోట్కుల్ లో గాల్లోకి కాల్పులు జరుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని, పదహారు ఇళ్లు దహనం చేశారని ఆరోపించింది. పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే మీడియాను, పౌరహక్కుల మేధావులను నిజనిర్థారణకు అనుమతించాలని మావోయిస్టు దండ కారణ్య కమిటీ ఓ ప్రకటనలో డిమాండ్ చేసినట్టు ఓ న్యూస్ ఛానెల్ లో ప్రసారమైంది.