: స్వచ్ఛతా ప్రమాణాల విషయంలో సికింద్రాబాద్, విశాఖ రైల్వేస్టేషన్లకు ‘ఏ1’ కేటగిరీ!


స్వచ్ఛ రైల్వేస్టేషన్ల ర్యాంకుల జాబితాలో సికింద్రాబాద్, విశాఖపట్టణం రైల్వేస్టేషన్లు చోటు దక్కించుకున్నాయి. దేశంలోని రైల్వేస్టేషన్లలో స్వచ్ఛతా ప్రమాణాలు పాటిస్తున్న స్టేషన్ల ర్యాంకుల జాబితాను కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. ఈ జాబితాలో ‘ఏ1’ కేటగిరీలో  సికింద్రాబాద్, విశాఖపట్టణం, జమ్మూతావి రైల్వేస్టేషన్లు చోటు దక్కించుకున్నాయి.

ఇక ‘ఎ’ కేటగిరిలో బియాస్, ఖమ్మం, అహ్మద్ నగర్ రైల్వేస్టేషన్లు ఉన్నాయి. కాగా, జోనల్ రైల్వేల్లో దక్షిణ మధ్య రైల్వేకు ప్రథమస్థానం దక్కగా, ద్వితీయస్థానంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే, తృతీయస్థానంలో మధ్య రైల్వే నిలిచాయి. అంతకుముందు, స్వచ్ఛ పోర్టల్ ను సురేశ్ ప్రభు ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా యాత్రికులు తమ సూచనలు, సలహాలు ఇవ్వొచ్చన్నారు. రైల్వేస్టేషన్లు, ప్లాట్ ఫాంలే కాకుండా ఇకపై రైళ్లకు కూడా ర్యాంకింగులు ఇవ్వనున్నట్టు మంత్రి ప్రకటించారు.

  • Loading...

More Telugu News