: భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య!
భార్య వేధింపులు తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. ఓఝార్ టౌన్ షిప్ కు చెందిన సంతోష్ పవార్ (32) ఒక ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సంతోష్ ను ఆయన భార్య ప్రియాపవార్, అత్తమామలు కృష్ణా పిండే, విష్ణు పిండే తరచుగా వేధిస్తుండేవారు. ఈ క్రమంలో మానసికంగా కుంగిపోయిన సంతోష్ తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
సంఘటనా స్థలంలో సూసైడ్ నోటు దొరికిందని, తన భార్య, అత్తమామలు మానసికంగా, శారీరకంగా తనను వేధింపుల పాలు చేశారని, అందుకే, తాను చనిపోవాలని అనుకుంటున్నానని అందులో రాశాడు. సంతోష్ ఆత్మహత్యపై అతని సోదరుడు సచిన్ పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు భార్య, అత్తమామలు, మరో వ్యక్తి అప్పా బోర్డుడేలపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనలో ఇంతవరకూ ఎవరినీ అరెస్టు చేయలేదు.