: ఆశ్చర్యం! మూడు గజాల లోతు తవ్వగానే నీళ్లు పడ్డాయి!
తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో మూడు గజాల గుంత తవ్వగానే నీళ్లు పడిన సంఘటన చోటుచేసుకుంది. కోహెడ మండలం వెంకటేశ్వరపల్లిలో మిషన్ భగీరథ ట్యాంక్ నిర్మాణానికి మూడు గజాల గుంత తవ్వారు. తవ్విన మూడు గజాలకే నీళ్లు పడటంతో గ్రామస్తులు ఆనందపడటమే కాకుండా ఆశ్చర్యమూ వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ సంఘటనపై నిపుణులను సంప్రదిస్తే వేసవిలో భూమి వేడికి నీరు వ్యాకోచించి బండ ప్రాంతంలో నుంచి ఇలా బయటకు వస్తుందని అన్నారు.