: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త... త్వరలోనే నిరుద్యోగ భృతి అందించనున్న సర్కారు
ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు భృతి అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఇటీవలే రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం రూ. 500 కోట్లను కూడా కేటాయించింది. ఇక నిరుద్యోగ భృతిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ అంశంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రతో ఏర్పాటు చేసిన సబ్ కమిటీ సమావేశమైంది. నిరుద్యోగ భృతి విధివిధానాలను ఖరారు చేయడంపై చర్చలు జరుగుతున్నాయి. నిరుద్యోగ భృతిని అందించే విషయంలో అవసరమైతే మరిన్ని నిధులను కేటాయించేందుకు తమ సర్కారు సిద్ధమేనని మంత్రులు పేర్కొన్నారు.