: మంత్రి ద్వారా రాజీకి యత్నాలు చేస్తున్న టైమ్, హెల్ప్ ఆసుపత్రి ఎండీలు!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిలో కలకలం రేపిన హవాలా కుంభకోణంలో లుకలుకలతో ఏజెంట్ ను కిడ్నాప్ చేసి, చితకబాదిన కేసులో పరారీలో ఉన్న హెల్ప్, టైమ్ ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టర్లు చలపాటి రవి, మైనేని హేమంత్ లు ఒక మంత్రితో రాయబారం నడుపుతున్నట్టు ఒక వార్తా ఛానెల్ తెలిపింది. ఈ ఘటనలో కేసు లేకుండా చేసుకునేందుకు బాధితుడు బ్రహ్మాజీతో సెటిల్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.
కాగా, విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్ ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తుండడంతో టైమ్ ఆసుపత్రి ఎండీ హేమంత్ మైనేని గత చరిత్రను తవ్వారు. దీంతో ఆయనపై గతంలో అనేక ఆరోపణలు ఉన్నట్టు గుర్తించారు. అంతే కాకుండా ఆరోగ్యశ్రీ కుంభకోణంలో జైలుకు కూడా వెళ్లి వచ్చాడని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ కేసు నుంచి బయటపడేందుకు ఆయన వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.