: చీరాల సీఐ పరంధామయ్యపై చర్యలు తీసుకోవాలంటూ ఒళ్లంతా గాయాలతో నడిరోడ్డుపై వ్యక్తి నిరసన


ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా చీరాలలో పోలీసుల వైఖరికి నిరసనగా ఒక వ్యక్తి చేసిన ఆందోళన కలకలం రేపుతోంది. అనిల్ అనే వ్యక్తి తనతోపాటు ఎంతో మందిపై సీఐ పరంధామయ్య అక్రమ కేసులు బనాయించాడని ఆరోపిస్తూ, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ... నడిరోడ్డుపై కారుకు రక్తంపూసి నినాదాలు చేస్తూ ఆందోళన తెలిపాడు. ఈ సమయంలో అనిల్ ఒంటి నిండా గాయాలు ఉండడం విశేషం. ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, సీఐ పరంధామయ్య కారణంగా తన భార్యా, బిడ్డలకు కూడా దూరమయ్యానని ఆయన తెలిపారు.

దళితులపై పరంధామయ్య పెట్టిన కేసులకు అంతులేదని ఆయన ఆరోపించారు. కాగా, దీనిపై పోలీసులు మాట్లాడుతూ, 2014లో క్రైమ్ 126 తో పాటు అతని భార్య 498 ప్రకారం పెట్టిన కేసులో అతను జైలుకు వెళ్లాడని, బెయిల్ పై విడుదలైన అనంతరం ప్రతి వాయిదాలో పోలీసుల్ని లేదా తన భార్యను దుర్భాషలాడుతాడని తెలిపారు. త్వరలో వాయిదా ఉండడంతో పోలీస్ స్టేషన్ కు వచ్చి, తనపాటు తెచ్చుకున్న కత్తితో రెండు చేతులపై పొడుచుకుని పోలీసుల్ని తిట్టాడని తెలిపారు. తాము మాత్రం మానవతా దృక్పధంతో అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లామని, అయితే ఆసుపత్రిలో ఉండనని, కారులో వెళ్లిపోయాడని తెలిపారు.

  • Loading...

More Telugu News