: గ్యాస్ బుక్ చేసుకోగానే బ్యాంక్ ఖాతాలో సబ్సిడీ


గ్యాస్ బుక్ చేసుకున్న వెంటనే ముందుగానే లబ్ధిదారులకు సిలిండర్ రేటుపై సబ్సిడీని వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తామని ఆర్థిక శాఖా కార్యదర్శి పి.వి.రమేష్ చెప్పారు. నగదు బదిలీపై సచివాలయంలో జరిగిన ఆర్థిక శాఖ సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆధార్ కు, గ్యాస్ కు ఎలాంటి సంబంధం లేదని, ఆధార్ లేకున్నా మార్కెట్ రేటుకు సిలిండర్ ఇస్తారని తెలిపారు. సబ్సిడీని బ్యాంకు ఖాతాలో వేయగానే గ్యాస్ సిలిండర్ కు మార్కెట్ రేటు సుమారుగా 1000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. జూలై 1 నుంచి మరో 5 జిల్లాలలో నగదు బదిలీ కార్యక్రమం మొదలవుతుందని చెప్పారు. బ్యాంకు ఖాతా నంబర్ ను గ్యాస్ డీలర్లకు ఇచ్చే విషయంలో ఎటువంటి అనుమానాలు, అపోహలు పెట్టుకోవద్దని కోరారు.

  • Loading...

More Telugu News