: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ ఖాతా హ్యాక్
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. ఈ ఖాతాను హ్యాకర్లు బ్లాక్ చేశారు. ఆయన పెట్టిన పోస్టులేవీ అభిమానులకు చేరడం లేదు. ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ పై సమాచార సాంకేతిక శాఖ నిపుణులను పవన్ కార్యాలయ సిబ్బంది సంప్రదిస్తోంది. సాధ్యమైనంత త్వరలో పవన్ ఖాతాను తిరిగి అధీనంలోకి తీసుకుంటామని జనసేన వర్గాలు వెల్లడించాయి. కాగా, ట్విట్టర్ లో ఎంతో యాక్టివ్ గా ఉండే పవన్, పలు అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ అభిమానులతో టచ్ లో ఉంటారన్న సంగతి తెలిసిందే.