: ఐపీఎల్ ఫైనల్లోకి పుణె సూపర్ జెయింట్.. ముంబై ఇండియన్స్ చిత్తు!
గతేడాది ఐపీఎల్‌లో ఏడో స్థానంలో నిలిచిన పుణె సూపర్ జెయింట్ జట్టు ఈసారి అసమాన ఆటతీరుతో ఫైనల్లో అడుగుపెట్టింది. ప్రత్యర్థి ముంబై జట్టుపై 20 పరుగుల తేడాతో విజయం సాధించి దర్జాగా ఫైనల్ చేరుకుని టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచింది. 162 పరుగుల ఓ మోస్తరు స్కోరు చేసినప్పటికీ అద్భుత ఆటతీరుతో విజయం సాధించింది. భారీ బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై ఇండియన్స్ లక్ష్య ఛేదనలో చతికిలపడింది. 163 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. అంతకుముందు తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పుణె నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 162 పరుగులు చేసింది.
కాగా, ముంబై ఇండియన్స్‌కు రెండో క్వాలిఫైర్ రూపంలో ఫైనల్స్‌కు చేరేందుకు మరో అవకాశం ఉంది. 17న (బుధవారం) సన్‌రైజర్స్ హైదరాబాద్-కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టుతో 19న ముంబై ఇండియన్స్ తలపడుతుంది. ఆ రోజున గెలిచిన జట్టుతో 21న జరిగే ఫైనల్స్‌లో పుణె అమీతుమీ తేల్చుకుంటుంది.