: ‘మిడ్-సమ్మర్’ పేరిట తక్కువ ధరలకే టిక్కెట్లను అందిస్తున్న మరో విమానయాన సంస్థ


వేసవి సంద‌ర్భంగా త‌మ ప్రయాణికులకు ఇప్ప‌టికే ప‌లు విమానయాన సంస్థ‌లు త‌క్కువ ధ‌ర‌కే టికెట్లను ఆఫర్ చేస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా విస్తారా కూడా రూ.999 ప్రారంభ టికెట్‌తో ‘మిడ్-సమ్మర్’ పేరిట ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. ఈ ఆఫ‌ర్ లో ప్ర‌యాణికులకు విస్తారా అందిస్తోన్న ఆఫ‌ర్ల‌లో భాగంగా జమ్ము-శ్రీనగర్, గువాహటి-బగ్దోగ్రా రూట్‌లో త‌క్కువ ధ‌ర‌కే ప్రయాణించవచ్చు. ఇక‌ ఢిల్లీ-చండీగఢ్‌కు రూ.1,499 కే టికెట్ పొంద‌వ‌చ్చు. ఢిల్లీ నుంచి లక్నోకు రూ.1,549, ఢిల్లీ నుంచి అమృత్‌సర్‌కు రూ.1,699తో టికెట్‌ను పొంద‌వ‌చ్చు.

ఈ నెల‌ 20 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఐదు రోజుల్లో బుకింగ్ చేసుకున్న ప్ర‌యాణికులు వ‌చ్చేనెల‌ 12 నుంచి వ‌చ్చే ఏడాది ఫిబ్రవరి 20 మధ్య ప్రయాణించవచ్చు. అయితే, ఈ స‌దుపాయం కేవలం ఎకానమీ క్లాస్‌కే వర్తిస్తుంది. అందులోనూ పరిమిత సీట్లకే.

  • Loading...

More Telugu News