: నా కెరీర్ లో ఆమె ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు: సచిన్
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’. ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సచిన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమాలో తన ప్రేమ కథను చూస్తారని, తన జీవితంలో అత్యుత్తమ భాగం భార్య అంజలి అని చెప్పారు. తన క్రీడా ప్రస్థానాన్ని మలచడంలో ఆమె పాత్ర ఎంతో ఉందని, అయితే, తన కెరీర్ లో మాత్రం ఆమె ఎప్పుడూ జోక్యం చేసుకోలేదన్నారు. ఇక,
తన సెంటిమెంట్ గురించి చెబుతూ, తానెప్పుడూ ఎడమ కాలికే ముందుగా ప్యాడ్ కట్టుకుంటానని అన్నారు.