: హైదరాబాద్ లో వడ్డీ వ్యాపారి దాష్టీకం.. అప్పు తీసుకున్న వ్యక్తి భార్యను కిడ్నాప్ చేసిన వైనం


హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో ఓ వడ్డీ వ్యాపారి చేసిన‌ దాష్టీకం బ‌య‌ట‌ప‌డింది. వాచ్ మెన్ గా పనిచేసే శ్రీ‌నివాస్ అనే వ్య‌క్తి తన వద్ద అప్పు తీసుకుని, తిరిగి చెల్లించ‌క‌పోవ‌డంతో అత‌డి భార్య‌ను ఆ వ‌డ్డీ వ్యాపారి కిడ్నాప్ చేశాడు. ఈ ఘ‌ట‌న‌పై శ్రీ‌నివాస్ అంబర్‌పేట పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు స‌ద‌రు వడ్డీ వ్యాపారి కోసం రెండు బృందాలతో గాలింపు ప్రారంభించారు. వ‌డ్డీ వ్యాపారి పేరు కూడా శ్రీ‌నివాస్ అని తెలుస్తోంది. అత‌డి వ‌ద్ద బాధితుడు గ‌తంలో రూ.4 ల‌క్షలు అప్పుగా తీసుకున్నాడు.         

  • Loading...

More Telugu News