: అసెంబ్లీ జరిగిన తీరు చూస్తే సిగ్గుగా ఉంది: ఎమ్మెల్యే రోజా
ఏపీ అసెంబ్లీ ఈ రోజు జరిగిన తీరు చూస్తే సిగ్గుగా ఉందని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. రైతులపై టీడీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని అన్నారు. రైతులకు రైతుల దగ్గర తక్కువ ధరకు కొనుగోలు చేసి, ‘హెరిటేజ్’లో ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని ఆమె ఆరోపించారు. వైఎస్సార్సీపీపై టీడీపీ బురదజల్లి తప్పించుకుందని, ఈ విషయాన్ని రైతులు గమనిస్తున్నారన్నారు.