: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చంద్రబాబు ఆగ్రహం


ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వాయిదా పడిన తరువాత కమిటీ హాల్ లో తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష సమావేశానికి హాజరు కావాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముందుగానే వర్తమానం పంపినా అత్యధికులు గైర్హాజరు కావడం పట్ల ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సమావేశానికి చంద్రబాబు వచ్చి కూర్చునే సమయానికి చాలా వరకూ కుర్చీలు ఖాళీగా ఉండటం, ఆపై ఒక్కొక్కరూ వస్తుండటంపై అసహనాన్ని వ్యక్తం చేసిన ఆయన, సభ్యుల తీరు నచ్చలేదని ఒకింత ఆగ్రహంగానే వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేసిన చంద్రబాబు, ప్రజా సమస్యల గురించి చర్చిద్దామంటే, స్పందన చూపకపోవడం భావ్యం కాదని వ్యాఖ్యానించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబు ఆగ్రహం గురించి తెలుసుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరుగు పరుగున కమిటీ హాల్ లోకి వెళ్లడం కనిపించింది.

  • Loading...

More Telugu News