: టైమ్ వేస్ట్ వద్దు... కొత్త డబుల్ బెడ్ రూంలు ఇప్పుడే రావు!: హైదరాబాద్ కలెక్టర్


నూతనంగా డబుల్ బెడ్ రూం ఇళ్ల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని, ప్రజలు దరఖాస్తులు ఇచ్చేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి సమయాన్ని వృథా చేసుకోవద్దని హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా సూచించారు. ప్రభుత్వం నుంచి నియమ నిబంధనలు వచ్చిన తరువాతనే కొత్త ఇళ్లకు దరఖాస్తులు తీసుకుంటామని, అంతవరకూ ప్రజలు సంయమనం పాటించాలని అన్నారు.

దరఖాస్తులు తీసుకునే పక్షంలో ముందుగానే తెలియజేస్తామని స్పష్టం చేస్తూ, ఆపై వార్డుల వారీ సమావేశాలు నిర్వహించి దరఖాస్తులను పరిశీలించి, లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు. 'మీ కోసం'లో భాగంగా జరిగిన సభలో పాల్గొన్న రాహుల్ బొజ్జా, పింఛన్, ఉద్యోగాలు తదితరాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి, తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News