: అభిమానులు ఎంత పిలిచినా పలకని రాజమౌళి!
'బాహుబలి-2' అఖండ విజయం తరువాత రాజమౌళి కుటుంబం కర్నూలు జిల్లా మంత్రాలయానికి వెళ్లి శ్రీరాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చిన వేళ, అభిమానులకు చుక్కెదురైంది. రాజమౌళితో మాట్లాడాలని, సెల్ఫీలు దిగాలని భావించిన ఎంతో మంది ఆలయానికి రాగా, అక్కడి సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు.
'సార్ ఓ సెల్ఫీ' అని అభిమానులు పిలుస్తున్నా, రాజమౌళి స్పందించకుండా తన వాహనంలోకి ఎక్కి కూర్చున్నారు. ఆపై కూడా పలువురు చిన్నారులు, మహిళలు ఆయనతో ఫోటోలు దిగాలన్న కోరికతో వాహనాన్ని చుట్టు ముట్టి ఎంతగా పిలిచినా రాజమౌళి స్పందించలేదు. దీంతో వారు తీవ్ర నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. రాజమౌళి ఆలయంలోకి వెళ్లిన సమయానికి అక్కడే ఉన్న కొందరితో మాత్రం రాజమౌళి కాసేపు మాట్లాడినట్టు సమాచారం.