: ఈ రోజు కూడా అభిమానులతో సమావేశమైన రజనీకాంత్


సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులతో ఈ రోజు కూడా సమావేశమయ్యారు. చెన్నైలోని కోడంబాక్కంలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో ఆయన తమిళనాడులోని తేని, తిరునల్వేలి, తూతుక్కుడి జిల్లాలకు చెందిన అభిమానులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అభిమానులతో ఆయన ముచ్చటిస్తున్నారు. వారితో ఫోటోలు, సెల్ఫీలు దిగుతున్నారు. ఈ సందర్భంగా మరోసారి తన రాజకీయ రంగప్రవేశంపై స్పందించారు. తనకు రాజకీయాల్లోకి రావాలని లేదని, వచ్చినా డబ్బు యావ ఉన్నవారిని దూరం పెడతానని రజనీకాంత్ మరోసారి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News