: కార్తీ చిదంబరం ఇంట్లో సీబీఐ సోదాలు


 కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం ఇంట్లో సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కార్తీ చిదంబరంపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నట్టు గతంలో ఆరోపణలు వచ్చాయి. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని భారీ ఎత్తున కార్తీ చిదంబరం సంపాదించారని ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో కుమారుడికి ప్రయోజనాలు చేకూర్చేలా చిదంబరం నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మారన్ సోదరులకు అక్రమ అనుమతులు మంజూరు వెనుక చిదంబరం, ఆయన కుమారుడు ఉన్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో చెన్నైలోని ఆయన నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. 

  • Loading...

More Telugu News