: తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు
పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. గతకొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు అకస్మాత్తుగా తగ్గాయి. పెట్రోలియం సంస్థలు లీటరు పెట్రోలుపై 2.16 పైసలు తగ్గించగా, లీటరు డీజిల్ పై 2.10 పైసలు తగ్గించాయి. గత అర్ధరాత్రి నుంచే ఈ ధరలు అందుబాటులోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయితో డాలర్ మారక విలువలో మార్పు కారణంగానే ఈ తగ్గుదల చోటుచేసుకుందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. త్వరలో అమలులోకి రానున్న జీఎస్టీ బిల్లు అమలు అనంతరం కూడా రాష్ట్రాల వ్యాట్ సవరింపులు చోటుచేసుకుంటే పెట్రో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.