: ‘బాహుబలి-2’ చిత్ర నిర్మాతలను బెదిరించిన నిందితుల అరెస్టు!
‘బాహుబలి-2’ చిత్ర నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనికి సైబర్ నేరగాళ్ల నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ చిత్రాన్ని ఉపగ్రహం ద్వారా పైరసీ చేశామని, తమకు రూ.2 కోట్లు చెల్లించాలని నిర్మాతలను డిమాండ్ చేశారు. ఈ మేరకు సీసీఎస్ పోలీసులకు ఈ చిత్ర నిర్మాతలు ఫిర్యాదు చేశారు. కాగా, బెదిరింపులకు పాల్పడిన ముగ్గురిలో పాట్నాకు చెందిన ప్రధాన సూత్రధారి రాహుల్ వర్మ, మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను రేపు హైదరాబాద్ తీసుకువస్తున్నట్లు పోలీసులు చెప్పారు.