: అద్భుతమైన బాహుబలి సినిమాకే అన్నేళ్లు పట్టింది: సీఎం చంద్రబాబు
ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న ఆంధ్రప్రదేశ్ నవ్య రాజధాని అమరావతి నిర్మాణంలో కొందరు అనవసర విమర్శలు చేస్తున్నారని, విమర్శలు కాదు చేతనైతే ప్రోత్సాహం ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అద్భుతమైన బాహుబలి సినిమా తీయడానికే అన్నేళ్లు పట్టిందని, మరి అంతకంటే అద్భుతమైన రాజధాని నిర్మాణానికి ఇంకా అధిక సమయం పడుతుందని ఆయన అన్నారు. రాజధాని నిర్మాణం మెల్లిగా జరుగుతోందంటూ పలువురు చేస్తోన్న విమర్శలు సరికాదని చెప్పారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు పనుల్ని యుద్ధప్రాతిపదికన చేపడుతున్నామని, దాన్ని పూర్తిచేస్తే కరవు అనేమాటే వినబడదని చంద్రబాబు చెప్పారు. ఓ ఉద్యమ స్ఫూర్తితో తాము అన్ని పనుల్ని ముందుకు తీసుకెళుతున్నామని అన్నారు.