: గవర్నర్ నరసింహన్ ను కలిసిన కేసీఆర్
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు కలిశారు. గవర్నర్ పదవీకాలం పొడిగించిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్ భవన్ లో నరసింహన్ ను కలిసిన కేసీఆర్ ఈ సందర్భంగా పలు అంశాలపై రెండు గంటల పాటు చర్చించారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నా, ఢిల్లీ పర్యటన అంశాలపైనా వారు చర్చించినట్టు సమాచారం.