: డొనాల్డ్ ట్రంప్ తలచుకుంటే ఎవరినైనా పదవి నుంచి తొలగిస్తారు: నిక్కీహేలీ


ఎఫ్‌బీఐ చీఫ్‌ జేమ్స్‌ కొమెను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధుల నుంచి తొల‌గించిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై వ‌స్తోన్న విమ‌ర్శ‌ల‌ను ఐక్యరాజ్యసమితిలో అమెరికా ప్రతినిధి నిక్కీహేలీ ఖండించారు. ట్రంప్‌ అమెరికాకి సీఈవో లాంటి వార‌ని, ఆయన తలచుకుంటే ఎవరినైనా పదవి నుంచి తొలగిస్తారని స్ప‌ష్టం చేశారు. ఆయ‌న‌ ప్రవృత్తి నచ్చని వారికి ఈ చర్యలు అసౌకర్యాన్ని కలిగిస్తాయని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఉత్తర కొరియా పాల్ప‌డుతున్న దుందుడుకు చ‌ర్య‌ల‌పై స్పందించిన నిక్కీహేలీ.. ఆ దేశం క్షిప‌ణి పరీక్షలు చేస్తుంటే కిమ్‌ జంగ్‌తో త‌మ దేశ అధ్య‌క్షుడు చర్చలు జరిపే ప్రస్తావనే లేదని అన్నారు.

  • Loading...

More Telugu News