: భవనాన్ని కూల్చడంలో మరోసారి విఫలమైన జీహెచ్ఎంసీ... ముగ్గురికి గాయాలు


మాదాపూర్ లో అక్రమంగా నిర్మించిన ఓ భవనాన్ని కూల్చడంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరోసారి ఫెయిల్ అయింది. బ్లాస్టింగ్ పద్ధతి ద్వారా ఈ భవనాన్ని రెండోసారి కూల్చడానికి యత్నించినప్పటికీ... భవనం పూర్తిగా నేలమట్టం కాలేదు. అంతేకాదు, బిల్డింగ్ కూలుస్తున్న సమయంలో రాళ్లు ఎగిరిపడటంతో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గాయపడ్డవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చుట్టుపక్కల వారికి సమాచారం ఇవ్వకుండానే బిల్టింగ్ ను జీహెచ్ఎంసీ బ్లాస్ట్ చేసిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News