: ‘బై నౌ.. ఫ్లై నౌ’... బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన ఎయిర్ ఏషియా


‘బై నౌ.. ఫ్లై నౌ’ పేరుతో అతి త‌క్కువ ధ‌ర‌ల‌కే దేశీయ విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా బంప‌ర్ ఆఫ‌ర్‌ ప్ర‌క‌టించింది. ఎంపిక చేసిన రూట్లలో అతి తక్కువ ధరల‌కే టికెట్లు అందించనున్న‌ట్లు త‌మ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ నెల 21 వరకూ ప్ర‌యాణికుల ముందు ఈ ఆఫ‌ర్ ను అందుబాటులో ఉంచుతున్న‌ట్లు తెలిపింది. ఈ ప‌థ‌కం ద్వారా బుక్ చేసుకున్న ప్ర‌యాణికులు.. వారు ఎంపిక చేసుకున్న తేదీ ప్రకారం సెప్టెంబర్‌ 4, 2017లోపు ప్రయాణించాల్సి ఉంటుందని తెలిపింది. రాంచి నుంచి కోల్‌కతా టికెట్ కేవ‌లం రూ.1,220 కే పొంద‌వ‌చ్చ‌ని, అలాగే గోవా నుంచి హైదరాబాద్ రూ.1,237కు, న్యూ ఢిల్లీ నుంచి శ్రీనగర్ వ‌ర‌కు రూ.2,062కు టికెట్లు పొంద‌వ‌చ్చ‌ని తెలిపింది.

  • Loading...

More Telugu News