: ట్రిపుల్ తలాక్ ను రద్దు చేస్తే.. దాని స్థానంలో కొత్తం చట్టం తీసుకొస్తాం:కేంద్రం
ముస్లిం మహిళల పట్ల ప్రాణాంతకంగా మారిన ట్రిపుల్ తలాక్ ను నిషేధిస్తే... దాని స్థానంలో సరికొత్త చట్టాన్ని తీసుకొస్తామని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ఈ మేరకు తెలిపారు. ఒకవేళ ట్రిపుల్ తలాక్ ను రద్దు చేస్తే... విడాకులు కోరే ముస్లిం పురుషుల పరిస్థితి ఏమిటని కోర్టు ప్రశ్నించింది. దీనికి సమాధానంగా రోహత్గీ పైవిధంగా స్పందించారు. చీఫ్ జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ట్రిపుల్ తలాక్ అంశాన్ని విచారిస్తున్న సంగతి తెలిసిందే.