: యువతిపై టీఆర్ఎస్ నాయకుడి అత్యాచారం!
మేడ్చల్ జిల్లా శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని అద్రాస్ పల్లి గ్రామంలో దారుణం జరిగింది. ఓ యువతిపై టీఆర్ఎస్ పార్టీ నాయకుడు గణేష్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడ్డ గణేష్ ఆమెపై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. సదరు యువతి కేకలు వేయడంతో స్థానికులు నిందితుడిని పట్టుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, బాధితురాలిని హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.