: రాహుల్ గాంధీని అన్ ఫాలో చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ట్విట్టర్ లో అనుసరించడాన్ని ఆ పార్టీ సీనియర్ నేత శంకర్ సిన్హ్ వాఘేలా ఆపేశారు. రాహుల్ అకౌంట్ ను అన్ ఫాలో అయ్యారు. ఆయనతో పాటు అహ్మద్ పటేల్, జీపీసీసీ అద్యక్షుడు భరత్ సిన్హ్ సోలంకీ తదితరులను కూడా అన్ ఫాలో అయ్యారు. రాహుల్ ను అన్ ఫాలో అవడం పార్టీ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

మరోవైపు, కాంగ్రెస్ హైకమాండ్ పై వాఘేలా గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారని... అందుకే ఇలా చేశారని కొందరు అంటున్నారు. గుజరాత్ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని వాఘేలా గత కొన్ని నెలలుగా హైకమాండ్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే ఎన్నికల కంటే ముందుగానే సీఎం అభ్యర్థిని ప్రకటించబోమని గుజరాత్ రాష్ట్ర ఇన్ ఛార్జ్ అశోక్ గెహ్లాట్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారాల నేపథ్యంలోనే వాఘేలా ఈ విధంగా స్పందించారని అంటున్నారు. 

  • Loading...

More Telugu News