: తన కూతుళ్ల మనస్తత్వాల గురించి శ్రీదేవి మాట!
సినీనటి శ్రీదేవి ప్రస్తుతం ‘మామ్’ అనే చిత్రంలో నటిస్తోంది. నిన్న మాతృ దినోత్సవం సందర్భంగా ఆమె తన కూతుళ్ల గురించి పలు విషయాలు తెలిపింది. తన కూతుళ్లు జాహ్నవి, ఖుషి మనస్తత్వాల గురించి, వారి అలవాట్ల గురించి చెప్పింది. తన పెద్ద కూతురు జాహ్నవిది చాలా మటుకు తన మనస్తత్వమేనని, నెమ్మదస్తురాలేనని తెలిపింది. అయినప్పటికీ తన పెద్ద కూతురు ఏం చేసినా తాను పక్కన ఉండాల్సిందేనని చెప్పింది.
ఇక తన చిన్న కుమార్తె ఖుషి చిన్నపిల్లే అయినా తన పనులన్నీ స్వయంగా చేసుకోగలదని తెలిపింది. జాహ్నవి మాత్రం ఎదుగుతున్న పిల్లే కానీ ఒక్కోసారి తానే భోజనం తినిపించాల్సి వస్తుందని పేర్కొంది. చిన్నపిల్లలాగా ఒక్కోసారి తనను పడుకోబెట్టమని అడుగుతుంటుందని తెలిపింది. తన చిన్న కూతురు అందుకు భిన్నంగా చిన్నప్పటి నుంచి చాలా స్వతంత్రంగా ఉంటుందని తెలిపింది. తన పెద్దకూతురు సినిమాల్లోకి రావాలనుకుంటోందని తెలిపింది.