: సాధారణ ప్రజలు కూడా రాజకీయం చేయగలరని నిరూపించడమే జనసేన లక్ష్యం: పవన్ కల్యాణ్
సామాన్య ప్రజలు కూడా రాజకీయాలు చేయగలరని నిరూపించడమే జనసేన పార్టీ లక్ష్యమని ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో తనను కలిసేందుకు వచ్చిన వారితో ఆయన మాట్లాడుతూ, కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడానికి మహా మేధావి కావాల్సిన అవసరం లేదని అన్నారు. సాధారణ ప్రజలు కూడా నిజాయతీగా, చిత్తశుద్ధితో ఉంటే విలువలు కలిగిన రాజకీయం సాధ్యమని చూపించడమే జనసేన లక్ష్యమని అన్నారు. అందుకే తాము వినూత్నంగా పార్టీ కార్యకర్తలను ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు. దీనికి భారీ ఎత్తున స్పందన వస్తున్న సంగతి తెలిసిందే.