: ఎమ్మెల్సీగా వాకాటి ప్రమాణం... గైర్హాజరైన టీడీపీ నేతలు
ఇటీవల తెలుగుదేశం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన వాకాటి నారాయణ రెడ్డి కొద్దిసేపటి క్రితం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ చక్రపాణి ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలెవరూ హాజరు కాలేదు. వాకాటి ఒక్కరే వచ్చి, చక్రపాణి కార్యాలయానికి వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. వివిధ కంపెనీల పేరిట బ్యాంకు రుణాలు తీసుకుని వాటిని చెల్లించలేదన్న ఆరోపణలతో ఇటీవల వాకాటి ఇంటిపై సీబీఐ దాడులు జరిగిన నేపథ్యంలో, ఆయన్ను సస్పెండ్ చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వాకాటి ప్రమాణ స్వీకారానికి పార్టీ దూరమైనట్టు తెలుస్తోంది.