: ఇప్పటికి నటుడినే... రేపు దేవుడు ఏ పని ఇస్తే అది చేస్తాను: రజనీకాంత్
ఇప్పటికి తాను నటుడినేనని, అందరికీ నచ్చే సినిమాలను చేసి రంజింపజేయడమే తన కర్తవ్యమని, రేపు దేవుడు తనకు ఏం పని అప్పగిస్తే అది చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులకు వెల్లడించారు. రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశం తనకు ఎన్నడూ లేదని చెప్పిన ఆయన, తప్పుడు వ్యక్తులకు దూరంగా ఉంటానని అన్నారు. తనకు అభిమానుల అండ, వారి ప్రేమ, ఆప్యాయతలే పదివేలని, వివాదాస్పద ప్రకటనలు చేసి వారిని అయోమయంలోకి నెట్టివేయడం తనకిష్టం లేదని అన్నారు. తాను రాజకీయాల్లోకి రానున్నట్టు, వచ్చినట్టు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పలువురు తమిళ ప్రజలతో పాటు, అభిమానులతో చర్చించిన తరువాతనే శ్రీలంక పర్యటనను వాయిదా వేసుకున్నట్టు తెలిపారు.