: సైబరాబాద్ పోలీసుల అదుపులో అంతర్రాష్ట్ర పైరసీ ముఠా.. పాట్నా కేంద్రంగా బాహుబలి-2 పైరసీ


అంతర్రాష్ట్రీయ పైరసీ ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్ రాజధాని పాట్నా కేంద్రంగా ఈ బృందం పైరసీలకు పాల్పడుతున్నట్టు పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారు. ఇటీవల విడుదలై సంచలనం సృష్టిస్తున్న బాహుబలి-2 సినిమాను పైరసీ చేసిన ఓ వ్యక్తి అందులోని కొన్ని సీన్లను చిత్ర నిర్మాణానికి సంబంధించిన వ్యక్తికి పంపి డబ్బులు డిమాండ్ చేశాడు. లేదంటే పూర్తి సినిమాను ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరించాడు. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైమ్ పోలీసులు పైరసీని గుర్తించారు.

పాట్నాలోని ఓ థియేటర్‌లో బాహుబలి-2 సినిమా ప్రదర్శితమైంది. ఆ థియేటర్‌లో టెక్నికల్ వ్యవహారాలు చూసే ఓ వ్యక్తే పైరసీకి పాల్పడినట్టు థియేటర్ కోడ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఇతడితో జట్టు కట్టిన ఢిల్లీ, హైదరాబాద్‌ నగరాలకు చెందిన కొందరు బెదిరింపు దందాకు దిగారు. ఆదివారం రాత్రి నాటికి ముఠాలోని నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News