: అనంతపురం జిల్లాలో పిడుగుపాటుకు ఐదుగురు రైతుల మృతి


అనంతపురం జిల్లా గుమ్మగట్టు మండలం కలుగోడులో పిడుగుపాటుకు ఐదుగురు రైతులు మృతి చెందారు. వర్షం పడుతున్న సమయంలో ఓ చెట్టు కింద ఉన్న గుడిసెలో తలదాచుకునేందుకు రైతులు వెళ్లిన సమయంలో ఈ దారుణం జరిగింది. ఐదుగురు రైతులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను ఓబన్న, శివన్న, కరీముల్లా, జయన్న, గిరిరెడ్డిగా గుర్తించారు.

కాగా, రాయదుర్గం మండలం కదరంపల్లిలో పిడుగుపాటుతో రెండు జెర్సీ ఆవులు మృతి చెందాయి. పిడుగుపాటుకు గురైన గ్రామానికి ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు బయలుదేరారు. మృతుల కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని, క్షతగాత్రులకు వైద్య సేవలు అందించాలని ఆయన ఆదేశించారు.

  • Loading...

More Telugu News