: ‘బాహుబలి-1’ నాలుగుసార్లు చూశాను.. రెండో పార్ట్ కూడా చూస్తాను: నటి అమల తల్లి మేహ్యూ
అమల నటించిన సినిమాల్లో ‘పుష్పక్’ (పుష్పక విమానం) అంటే తనకు చాలా ఇష్టమని నటి అమల తల్లి మేహ్యూ అన్నారు. మాతృదినోత్సవం సందర్భంగా ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తల్లీకూతుళ్లు ఇద్దరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేహ్యూ మాట్లాడుతూ, అమల చాలా సినిమాల్లో నటించినప్పటికి ‘పుష్పక్’ సినిమా అంటే తనకు బాగా ఇష్టమని, చాలా ఫన్నీగా ఉంటుందని చెప్పారు.
తాజాగా ఏ సినిమాలు చూశారనే ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ, ‘‘బాహుబలి-2’ చూశాను. బాహుబలి-1’ నాలుగుసార్లు చూశాను. ‘బాహుబలి-2’ కూడా మరో మూడు సార్లు చూస్తాను’ అని అన్నారు. కూతురు అమల, అల్లుడు నాగార్జున వద్ద గడుపుతున్న తన జీవితం చాలా సంతోషంగా ఉందని, నాగార్జున వంటి మంచి అల్లుడు మరెవరికీ దొరకరని ఈ సందర్భంగా మేహ్యూ చెప్పుకొచ్చారు.